నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ సీఎం ఇంటి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓట్ చోరీని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు భారీ యోత్తున ఆందోళన చేపట్టారు. జైపూర్‌లోని ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసాం వద్ద బైటయించారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోతుందని, రైతుల సాగు సమస్యలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం నివాసాంలోకి చొచ్చుకెళ్లేందుకు నిరసనకారులు యత్నించారు. ఈక్రమంలో అప్రమమత్తమైన పోలీసులు బారికేడ్లతో ఆందోళనకారులను అడ్డగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపై వాటర్ పిరంగులను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.




