నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఐ లవ్ మహమ్మద్ ఆందోళనకు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం పూజారి, ఇత్తెహద్ ఇ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్టు చేశారు. శనివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐ లవ్ మహమ్మద్ క్యాంపెయిన్‌కు మద్దతు ఇచ్చేవాళ్లు భారీ సంఖ్యలో హాజరుకావాలని తౌకీర్ రాజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీగా ఆయన ఇంటి ముందు జనం గుమ్మిగూడారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.
శుక్రవారం రాళ్లు రువ్విన స్థానికులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పది మంది పోలీసులు గాయపడ్డారు. రాజా ఇంటి ముందు ప్లకార్డులతో జనం భారీగా గుమ్మికూడి నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బరేలీ ఘటనతో లింకున్న 8 మందిని అరెస్టు చేశారు. 50 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. గుర్తు తెలియని 1700 మందిపై కేసు ఫైల్ చేశారు.