నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో నశించిన శాంతిభద్రతలు, పెరిగిన నిరుద్యోగం, ఉపాధి భద్రత, అధిక ద్రవ్యోల్బణం తదితర అంశాలపై అత్యవసరంగా సభలో చర్చ పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ఆందోళనకారులను నిలువరించడానికి బారికేడ్లలను అడ్డుగా ఉంచారు. కానీ వాటిని ముందుకు తోసుకుంటూ, బారికేడ్లల పైనుంచి జంప్ చేస్తూ ఎమ్మెల్యేలు ముందుకు సాగారు. ఈక్రమంలోనే పోలీసులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
సభ సజావుగా సాగాలని పార్టీ ఆశిస్తున్నదని, రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని స్పీకర్‌ను కోరాం. కాంగ్రెస్ శాసనసభా పార్టీ సభను సజావుగా, క్రమబద్ధంగా నడపాలని కోరుకుంటుందని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు యశ్‌పాల్ ఆర్య మీడియాతో చెప్పారు.



