- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్‌తో ఉద్రిక్తతు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు హానికరమని మూడీస్ సంస్థ వెల్లడించింది. ఇరుదేశాల పరిస్థితిపై మూడీస్ సంస్థ నివేదిక రూపొందించింది. పాక్ విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇతర దేశాల నుంచి పాక్‌కు ఆర్థిక సాయం తగ్గుతుందని నివేదికలో పేర్కొంది. భారత్ ఆర్థిక కార్యకలాపాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని తెలిపింది. ఈ ఉద్రిక్తతలు విస్తృత సైనిక సంఘర్షణకు దారితీయకపోవచ్చని పేర్కొంది.
- Advertisement -