- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సరిగా చదవడం లేదని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దోమలగూడ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరవింద్ అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. కాగా, అరవింద్ సరిగా చదవడం లేదని అతడి తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



