నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ సూడాన్‌కి తాత్కాలిక రక్షిత హోదా(టిపిఎస్)ను రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ రద్దు వచ్చేఏడాది జనవరి 5 నుండి అమల్లోకి రానుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్గత నిఘా వర్గాలతో చర్చించిన తర్వాత, సూడాన్‌లో పరిస్థితులు ఇకపై టిపిఎస్ చట్టబద్దమైన అవసరాలకు అనుగుణంగా లేవని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ నిర్థారించారని ప్రకటన పేర్కొంది. కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ మొబైల్ యాప్ వినియోగించి నిష్క్రమించే దక్షిణ సూడానీయులు కాంప్లిమెంటరీ విమాన టికెట్, వెయ్యిడాలర్ల ఎగ్జిట్ బోనస్‌తో పాటు చట్టబద్ధమైన వలసలకు భవిష్యత్తులో అవకాశాలు కూడా పొందవచ్చని పేర్కొంది. ట్రంప్ యంత్రాంగం వలసదారులు అమెరికాలో ఉండి చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతించే వివిధ రక్షిత అవకాశాలను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. తాత్కాలిక రక్షిత హోదా దక్షిణ సూడాన్ దేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు, సాయుధ పోరాటం నుండి తప్పించుకుని తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు అనుమతిస్తుంది.
దక్షిణ సూడాన్‌కి తాత్కాలిక రక్షిత హోదా రద్దు: అమెరికా
- Advertisement -
- Advertisement -



