– స్ట్రీట్ ఫెస్టివల్‌పైకి దూసుకెళ్లిన వాహనం..
– 9 మంది మృతి
వాంకోవర్ : కెనడాలోని వాంకోవర్ నగరంలో స్ట్రీట్ ఫెస్టివల్‌పైకి ఓ వాహనం దూసుకుపోవడంతో 9 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈస్ట్ 41వ అవెన్యూ, ఫ్రెజర్ స్ట్రీట్‌లో లాపులాపు డే బ్లాక్ పార్టీ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న వారిపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. దీంతో కడపటి వార్తలందేవరకు 9 మంది చనిపోగా..పలువురు గాయాలపాలైనట్టు స్థానిక పోలీసులు ఎక్స్‌లో వెల్లడించారు. అయితే.. ఎంత మంది చనిపోయారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొన్నాయి. ఈ ఘోరానికి కారణమైన డ్రైవర్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా.. కావాలని చేసిన దాడో తెలియాల్సి ఉంది. మృతులకు ప్రధాని మార్క్ కార్నీ సంతాపం తెలిపారు. చనిపోయిన వారిలో చాలా మంది ఫిలిప్పినో-కెనడా జాతీయులు ఉన్నారు. వాంకోవర్ మేయర్ కెన్ సిమ్, బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఎబే ఈ ఘటనపై దిగ్రాభంతి వ్యక్తం చేశారు.
వాంకోవర్‌లో ఘోరం..
- Advertisement -
RELATED ARTICLES