నవతెలంగాణ- హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా జాతీయ భద్రతాపై కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఎల్లవేళాల అప్రమత్తంగా ఉండాలని ఆయా భద్రతా బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తీవ్రవాద కార్యకాలపాలను కట్టడి చేయడానికి సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో పంజాబ్ సరిహద్దులో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అమృత్ సర్ జిల్లా భర్‌పోల్ గ్రామంలో బీఎస్ఎఫ్-ఆ రాష్ట్ర పోలీసులు సంయుక్తం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో పలు ఆయుధాలు గుర్తించాయి. బాంబులు, మూడు పిస్టల్స్, ఆరు మ్యాగజైన్స్, 50రౌండ్లకు సరిపోయే బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
పంజాబ్‌లో ఉగ్రకుట్ర భగ్నం..పలు ఆయుధాలు స్వాధీనం
- Advertisement -
RELATED ARTICLES