Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంరిపబ్లిక్‌ డే వేడుకలకు ఉగ్ర‌ముప్పు

రిపబ్లిక్‌ డే వేడుకలకు ఉగ్ర‌ముప్పు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకలకు ఉగ్ర‌ముప్పు పొంచి ఉంద‌ని నిఘ‌వ‌ర్గాలు తెలిపాయి. (Republic Day celebrations) ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్ర సంస్థలు ఈ గణతంత్ర వేడుకుల సందర్భంగా ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులకు ప్రయత్నించవచ్చునని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఉగ్రనెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపాయి. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన నేపథ్యంలో.. నిఘా వర్గాల హెచ్చరికలపై అధికారులు అలర్ట్‌ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేశారు. దాంతో రాష్ట్రాల్లో తనిఖీలు మొదలుపెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -