– 100 నివాసాల్లో పోలీసుల సోదాలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో ముష్కరుల కోసం వేట కొన సాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇండ్లల్లో తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్‌ఐఏ అతడిని అరెస్ట్ చేసింది.
కాశ్మీర్‌లో ఉగ్రవేట..
- Advertisement -
- Advertisement -