నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున సాంబ సెక్టార్ లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ఈ విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. బీఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో పాక్ సైనిక పోస్ట్ ధ్వంసమైందని తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై బీఎస్ఎఫ్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కాగా, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సర్వేలెన్స్ కెమెరా ఫుటేజీని భద్రతా బలగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఉగ్రవాదుల చొరబాటుయత్నం.. ఏడుగురి కాల్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES