Tuesday, July 8, 2025
E-PAPER
Homeఆటలుజింబాబ్వేతో టెస్ట్ సిరీస్..విలియంసన్‌కు నో ఛాన్స్

జింబాబ్వేతో టెస్ట్ సిరీస్..విలియంసన్‌కు నో ఛాన్స్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జింబాబ్వేతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు జట్టును ప్రకటించింది. 15 మంది ప్రాబబుల్స్ లో కూడిన జట్టును సోమవారం (జూలై 7) ప్రకటించింది. ఈ టెస్ట్ సిరీస్ కు కివీస్ దిగ్గజ బ్యాటర్.. మాజీ కెప్టెన్ విలియంసన్ ను ఎంపిక చేయలేదు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ సమయంలోనే కేన్ తాను జింబాబ్వే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండనని చెప్పినట్టు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ చెప్పాడు. ప్రస్తుతం విలియంసన్ ది హండ్రెడ్ 2025 లీగ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.
టెస్ట్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లుండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ’రూర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, విల్ యంగ్ 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -