Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనేటి నుంచి టెట్‌ పరీక్షలు

నేటి నుంచి టెట్‌ పరీక్షలు

- Advertisement -

– 1.83 లక్షల మంది దరఖాస్తు
– 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీటెట్‌) రాతపరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, టెట్‌ చైర్‌పర్సన్‌ ఈ నవీన్‌ నికోలస్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్‌ రాతపరీక్షలను తొమ్మిది రోజులపాటు 16 విడతల్లో నిర్వహిస్తామని తెలిపారు. టెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా పేపర్‌-1కు 63,261 మంది, పేపర్‌-2కు 1,20,392 మంది కలిపి మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలున్నాయని వివరించారు. టెట్‌ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు, సమస్యలుంటే 7093708883/7093708884/7093958881/7093468882 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad