- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ టెట్ – 2026 హాల్ టికెట్లపై అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇవాళ ఉదయం (డిసెంబర్ 27) 11am తర్వాత schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో నుంచి హాల్ టికెట్లను పొందవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.
- Advertisement -



