నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
టెక్స్మో ఇండస్ట్రీస్, మోటార్ పంపుల తయారీలో దేశంలోనే ప్రముఖ సంస్థ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రైతులకు, గృహ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా, తమ మెకానిక్‌ల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక అధ్యయన శిబిరాలను నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమం కింద, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టెక్స్మో అధీకృత డీలర్ సంతోష్ ఎలక్ట్రికల్స్ అండ్ ఇంజనీరింగ్ స్టోర్స్ ఆధ్వర్యంలో కొంతమంది మెకానిక్‌లు కోయంబత్తూర్‌లోని టెక్స్మో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ వారికి సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వబడుతుంది .సంతోష్ ఎలక్ట్రికల్స్ యజమానులు, టెక్స్మో డీలర్లు చింతోజు భాస్కర్ ,చింతోజు నారాయణ ఈ పర్యటనకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతోజు భాస్కర్ మాట్లాడుతూ.. 1956లో స్థాపించబడిన టెక్స్మో ఇండస్ట్రీస్, గత 70 ఏళ్లుగా సంస్థ ఎండీ దమయంతి రామచంద్రన్ నాయకత్వంలో అగ్రస్థానంలో కొనసాగుతోందని అన్నారు. ఈ సంస్థ నాణ్యమైన సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేస్తుందని ఆయన తెలిపారు.మారుతున్న ఇంజనీరింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, మెకానిక్‌లు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ అధ్యయన పర్యటనను ఏర్పాటు చేశామని చింతోజు భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య చారి, శ్రీనివాస్ రెడ్డి, పోశెట్టి, నాగయ్య వంటి మెకానిక్‌లు పాల్గొన్నారు.
కోయంబత్తూర్ కు టెక్స్ మో మెకానిక్ లు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES