నవతెలంగాణ-హైదరాబాద్: TG EAPCET & PGECET Exam Dates: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన కీలక తేదీలను అధికారులు ప్రకటించారు. TG EAPCET–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. మే 4, మే 5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనుండగా.. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
TG EAPCET పరీక్షల తేదీలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



