శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్ వీడియోతో తెలిపారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ వీడియో ఫన్నీగా డిజైన్ చేశారు. తాను గట్టిగా అడిగినందు వల్లే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించారని, ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగితే చేస్తారని హీరోయిన్ వర్ష బొల్లమ్మ చెప్పగా, తాను అడిగితేనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారని లయ అంటుంది. వీళ్లిద్దరితో పోటీ పడుతూ స్వస్తిక విజయన్, సప్తమి గౌడ, బేబి శ్రీరామ్ దిత్య తాము చెప్పడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారని అంటారు. ఇలా వీళ్లు గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి ‘మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ట్రైలర్ చూడండి’ అని చెప్తాడు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ ఇలా సరికొత్తగా డిజైన్ చేయడం మూవీ లవర్స్ దష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ఓ మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని మేకర్స్ చెప్పారు.