– డిప్యూటీ సీఎంకు టీజీపీఈఏ నేతల కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌శాఖలో 2012 బ్యాచ్‌కి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు అసిస్టెంట్ డివిజనల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) కృతజ్ఞతలు తెలిపింది. సోమవారంనాడిక్కడి ప్రజాభవన్‌లో టీజీపీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రత్నాకరరావు, పీ సదానందం డిప్యూటీ సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు చెప్పారు. 4వేల మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేయడానికి అనుగుణంగా ఇంజనీర్లకు పోస్టింగ్ ఇచ్చారని వివరించారు. గడచిన 15 ఏండ్లలో 209 మందికి పదోన్నతులు కల్పించడం ఇది మొదటిసారి చెప్పారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికతో రబీ సీజన్‌లో అత్యధికంగా 17,162 మెగావాట్ల విద్యుత్‌ను మార్చి నెలలో సరఫరా చేయగలిగామన్నారు. విద్యుత్ ఇంజినీర్లు తమ విధుల పట్ల ఎల్లప్పుడు పునరంకితం అయ్యే ఉంటారని తెలిపారు.
పదోన్నతులు ఇచ్చినందుకు థ్యాంక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES