Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు…

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మన్నే వారి పంపు గ్రామ ప్రజలకు ఫ్లోరిన్ లేని వాటరు తాగడానికి నూతన వాటర్ ఫిల్టర్ ను అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి గ్రామ ప్రజలు తరపున కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్ల రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం గ్రామానికి వాటర్ ఫిల్టర్ చేరిన సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని నెలల నుంచి గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేదని ఫిల్టర్ వాటర్ కోసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వాటర్ ఫిల్టర్ గ్రామానికి అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు.  ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెంటనే గ్రామానికి నూతన వాటర్ ఫిల్టర్ ను అందజేశారని, ఈ వాటర్ ఫిల్టర్ ను ఐదు రోజుల్లో ప్రారంభించి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుజ్జ నరసింహ,  గంగాదేవి కొండలు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాదేవి రవి, నాయకులు మెడబోయిన రాము,  మల్లేబోయిన వెంకటేష్, మెడబోయిన లక్ష్మణ్, బోయిని మధు, మల్లెబోయిన శ్రీశైలం, మెడబోయిన మధు, ఎల్లంల విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -