నవతెలంగాణ-హైదరాబాద్: సోషలిజం, లౌకికవాదంపై బీజేపీ పరోక్షంగా దాడి చేస్తోందని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జెపిఎన్‌ఐసి)ని బిజెపిఎల్‌డిఎ (లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ)కి అప్పగించాలని యోచిస్తోంది. బీజేపీ నిర్ణయాన్ని అఖిలేష్ తీవ్రంగా తప్పుపట్టారు. జెపిఎన్‌ఐసిని ఎల్‌డిఎకి అప్పగించడం సోషలిస్ట్ ఐకాన్ జయప్రకాశ్ నారాయణ్ వారసత్వానికి అవమానంగా ఆయన అభివర్ణించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయం పట్ల తనెంతో నిరాశ చెందినట్లు అఖిలేష్ అన్నారు. ఎందుకంటే తాను, చౌదరి సాహబ్ జెపిఎన్‌ఐసి సొసైటీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
కాగా, గురువారం అజంగఢ్‌లో కొత్త పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోతవ్సం తర్వాత బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘నేను ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత గార్డును సస్పెండ్ చేశారు. చాలా సంవత్సరాలుగా దాన్ని మూసివేశారు. అప్పుడు నా జేబులో వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. మళ్లీ నా బాటిల్‌ని అడిగితే.. దాన్ని తమ దగ్గరే ఉంచుకున్నట్లు బిజెపి చెప్పింది. నేతాజీ జెపిఎన్‌ఐసి పునాదిరాయి వేశారు. దీని ప్రారంభోత్సవానికి అనేకమంది సోషలిస్టు నాయకులు హాజరయ్యారు. ఈ తరం ప్రజాస్వామ్య పోరాటాన్ని చూడగలిగేలా జెపిఎన్‌ఐసి నిర్మించబడింది. సంపూర్ణ విప్లవం నినాదంతో వచ్చిన మార్పును ప్రజలు చూశారు. అలాంటి ఈ సెంటర్‌ని ఎల్‌డిఎకి ఇచ్చారు. ఎల్‌డిఎకి ఏ పని ఉంది? ఎల్‌డిఎ భవనాలను నిర్మించదు. కానీ చేపల మార్కెట్లను నిర్మిస్తుంది. ఒకవేళ జెపిఎన్‌ఐసి అమ్మాలివ్స వస్తే.. మేము, సోషలిస్టు ప్రజలు కొనుగోలు చేస్తారు’ అని అన్నారు.
జెపిఎన్‌ఐసిని నాశనం చేయాలనుకునేవారు ఏ ముఖంతో బీహార్‌లో ఓట్లు అడుగుతారు. ఈ జెపిఎన్‌ఐసిపి జెపికి అంకితం చేశారు. బీహార్‌లో ఎన్నికలు జరిగినప్పుడల్లా వారు రిజర్వేషన్, రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. నిజం ఏమిటంటే వారు వారు ఓట్లు కోల్పోతారనే భయంతో రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నేరుగా మాట్లాడటానికి భయపడుతున్నారు. అందుకే వారు సోషలిజం, లౌలికవాదంపై పరోక్షంగా దాడి చేస్తారు’ అని అన్నారు.