Wednesday, December 17, 2025
E-PAPER
Homeజాతీయంఆ వాహ‌నాల‌పై ఢిల్లీలో నిషేధం

ఆ వాహ‌నాల‌పై ఢిల్లీలో నిషేధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వాయు కాలుష్యంపై స‌ర్వోన్న‌త న్యాయంస్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌ది ఏండ్లు పైబ‌డిన డీజిల్ తో న‌డిచే వాహ‌నాలు, అలాగే 15 ఏండ్లు పైబ‌డిన పెట్రోల్ వాహ‌నాల‌ను న‌గ‌రంలో తిర‌గ‌డానికి వీలులేద‌ని, వీటిపై నిషేధం విధిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. డిసెంబ‌ర్ 18నుంచి స‌దురు వాహ‌నాల‌పై నిషేధం అమ‌లోకి వ‌స్తుంద‌ని ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. ఆలోపు స‌దురు వాహ‌నాల యాజ‌మాన్య‌ల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించింది. ఢిల్లీలో తిర‌గడానికి బీఎస్-4 ఇంజ‌న్ వాహ‌నాల‌కు మిన‌హ‌యింపు ఉంటుంద‌ని న్యాయ‌స్థానం తెలిపింది. ఢిల్లీలో BS4 ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇస్తామని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఢిల్లీలో పొలూష్యన్‍ కారణం అని పేర్కొంటూ ఢిల్లీలో ఉన్న 9 టోల్ గేట్లను మరో చోటుకు మార్చాలని ఆదేశించింది. రాష్ట్ర స‌రిహ‌ద్దు వెంబడి ఉన్న ప‌లు టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర విప‌రీతంగా ట్రాపిక్ జాం అవుతుంద‌ని, దీంతో తీవ్ర గాలి కాలుష్యానికి దారి తీస్తున్నాయ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. వ‌చ్చే జ‌న‌వ‌రి 31లోపు సదురు టోల్ ప్లాజాల‌పై స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఢిల్లీ ప్ర‌భ‌త్వానికి సూచించింది.

ప‌లు రోజుల నుంచి ఢిల్లీలో పెరిగిపోత‌న్న వాయు కాలుష్యాన్ని నివారించ‌డంలో బీజేపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ఢిల్లీవాసులు త‌మ ప్ర‌భుత్వాన్ని క్ష‌మించాల‌ని ఇటీవ‌ల‌ రేఖాగుప్తా మంత్రి వ‌ర్గంలోని ప‌ర్యావ‌ర‌ణ మంత్రి మ‌నుంద‌ర్ సింగ్ ఓ ప్రెస్ మీట్‌లో బ‌హిరంగంగా కోరారు. ఢిల్లీలో వాయు కాలుష్యం త‌గ్గించ‌డానికి కృత్రిమ వ‌ర్షాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ర‌సాయాలు వెద‌జెల్లిన ఎలాంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేదు. మ‌రోవైపు శీత‌కాలం నేప‌థ్యంలో విప‌రీతంగా ఢిల్లీని పొగ‌మంచు క‌మ్మేస్తోంది. గాలి కాలుష్యానికి తోడు ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఢిల్లీ వాసుల‌కు ఊపిరీ మేస‌ల‌కుండా చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యంతో ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ప‌డిపోయింది. ఈక్ర‌మంలోనే ఢిల్లీ వాయు కాలుష్యంపై స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. విచారించిన కోర్టు తాజాగా ప‌ది ఏండ్లు పైబ‌డిన డీజిల్ తో న‌డిచే వాహ‌నాలు, అలాగే 15 ఏండ్లు పైబ‌డిన పెట్రోల్ వాహ‌నాల‌ను న‌గ‌రంలో తిర‌గ‌డానికి వీలులేద‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -