Monday, May 12, 2025
Homeజాతీయంఅందుకే పాక్‌పై దాడి చేశాం: భారత్‌ డిజిఎంఒ

అందుకే పాక్‌పై దాడి చేశాం: భారత్‌ డిజిఎంఒ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉగ్రవాదానికి అండగా పాక్‌ నిలుస్తోందని, అందుకే తాము పాకిస్తాన్‌పై దాడి చేశామని భారత్‌ డిజిఎంఒ తెలిపారు. ప‌హ‌ల్గాం దాడికి ప్ర‌తీకారంగా మే 7న చేప‌ట్టిన ఆపరేషన్‌ సిందూర్ పై త్రివిధ దళాల డీజీఎంవోలు సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌ డిజిఎంఒ మాట్లాడుతూ … దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారని అన్నారు. ఉగ్ర‌వాదుల స్థావ‌రాలే ల‌క్ష్యం భార‌త్ ఆర్మీ దాడులు చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. కానీ పాకిస్థాన్ భార‌త్ పై దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. సామాన్య పౌరులు, వారి నివాసాలే ల‌క్ష్యంగా పాక్ ఆర్మీ డ్రోన్ల‌తో దాడుల‌కు దిగింద‌ని, ఆ దాడుల‌ను ఇండియ‌న్ ఆర్మీ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింద‌ని చెప్పారు. ఉగ్రవాదానికి అండగా పాక్‌ నిలుస్తోందని, అందుకే తాము పాకిస్తాన్‌పై దాడి చేశామని తెలిపారు. పాకిస్థాన్‌ వివిధ రకాల డ్రోన్లను వినియోగించిందని తెలిపారు. ఏ నష్టం జరిగినా దీనికి బాధ్యత పాకిస్తాన్‌దేనన్నారు. భారత్‌ వైపు గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్‌ అడ్మిరల్‌ ప్రమోద్‌ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్లు, రాడార్లు ఉపయోగించామన్నారు. ఫ్లీట్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ను సమర్థంగా వినియోగించామని చెప్పారు. డ్రోన్లు, హైస్పీడ్‌ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -