నవతెలంగాణ-కంఠేశ్వర్
నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మద్దుకూరి సాయిబాబు, వాల బాలకిషన్ తెలిపారు. ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇందూరు యువత కార్యలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ..14 ఏండ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మానవత్వపు గుండె నీడన-2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలవైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డా.కాసర్ల నరేష్ రావ్, దర్శనం రాజు, చందా జగన్ మోహన్, సిర్పలింగం, రవి, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18న స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



