Monday, May 19, 2025
Homeరాష్ట్రీయంప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దుర్ఘటన

ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే దుర్ఘటన

- Advertisement -

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ
– ఘటనా స్థలం సందర్శన
నవతెలంగాణ-ధూల్‌పేట్‌

ప్రభుత్వ అధికారులు, వ్యవస్థల నిర్లక్ష్యంతోనే గుల్జార్‌హౌస్‌లో ఏసీ షార్ట్‌ సర్క్యూట్‌తో 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. ఆదివారం ఘటనా ప్రాంతాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా ప్రతినిధి బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫైరింజన్లలో సరిపడా నీళ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, మాస్క్‌లు ఉన్న ఫైరింజన్లు, అంబులెన్స్‌లు రాకపోవడంతో ఇంతమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ అధికారులు సరైన అవగాహన కలిగించకపోవడం ఈ దుర్ఘటనకు కారణమని తెలిపారు. సీపీఐ(ఎం) చార్మినార్‌ జోన్‌ కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా నేతలు ఎమ్‌.మీనా,జి. విఠల్‌, పి.నాగేశ్వర్‌, ఎస్‌ కిషన్‌, కే జంగయ్య, ఏ కృష్ణ, బాబర్‌ ఖాన్‌, రాంకుమార్‌, యాకూబ్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -