Monday, September 15, 2025
E-PAPER
Homeజిల్లాలుఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అడ్డగోలు ఆరోపణలు సరికాదు

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అడ్డగోలు ఆరోపణలు సరికాదు

- Advertisement -
  • వేల్పూర్ లో బిఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం
  • నవతెలంగాణ-కమ్మర్ పల్లి: రాష్ట్రంలో ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న యూరియా కొరతపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సోమవారం వేల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక్క సంచి యూరియా కోసం రోడ్లమీద ఎందుకు నిలబడుతున్నారో నాయకులు సమాధానం చెబుతారా అని ప్ర‌శ్నించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారని, అయ్యా సునీల్ రెడ్డి మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.
  • మోడీ ముందట ధర్నా చేయడానికి భయపడుతున్నారా? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో యూరియా కోసం ఆందోళన చేసే విషయంలో మోడీ ముందుకు వెళ్లేందుకు భయపడుతున్నారా? అని టిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు.ఒక్కొక్క సొసైటీకి ఎంత యూరియా అవసరం ఉంది, ఎంత సరఫరా చేశారన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏంటో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు.దేశానికి రైతే వెన్నెముక అలాంటి రైతు ఒక్క యూరియా బస్తా కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు చెర్ల నీళ్లు త్రాగే పరిస్థితి తెచ్చారన్నారు.ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన వారి యొక్క సమస్యలను ప్రభుత్వంకు తెలియజేయడానికి ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సమస్యలపై మాట్లాడితే ప్రజలందరు అన్ని గమనిస్తున్నారని, గత పరిపాలన ఎలా ఉండే, ప్రస్తుతం మీ పరిపాలన ఎలా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బండకేసుకొనడానికి ప్రజలందరూ మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నారన్నారు.ఎద్దు ఏడ్చినా ఎవసం, రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే యూరియా బుక్కిచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఈ సమావేశంలో బాల్కొండ నియోజకవర్గం లోని ఆయా మండలాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -