Sunday, January 11, 2026
E-PAPER
Homeజిల్లాలుసైకాలజిస్ట్ ల  నియామకాన్ని వెంటనే అమలు చేయాలి 

సైకాలజిస్ట్ ల  నియామకాన్ని వెంటనే అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ప్రతి స్కూల్, కాలేజీలో సైకాలజిస్టులు నియామకం వెంటనే అమలులోకి వచ్చేలా చేయాలని మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డాక్టర్ పద్మా కమలాకర్ అన్నారు. ప్రభుత్వ  ప్రకటనపై  ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నామన్నారు. ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, భావోద్వేగ వికాసానికి తీసుకున్న చారిత్రాత్మకమైన, దూరదృష్టి గల నిర్ణయంగా భావిస్తున్నామని చెప్పారు. చదువు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్న స్పష్టమైన సందేశాన్ని ఈ ప్రకటన నిచ్చిందని చెప్పారు. సైకాలజిస్టులు నియామకం వల్ల విద్యార్థులు తమ సమస్యలను భయంలేకుండా చెప్పుకొనే వాతావరణం ఏర్పడుతుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కుడ సరైన మార్గనిర్దేశం లభిస్తుందని చెప్పారు. విద్యావ్యవస్థ మరింత సమతుల్యంగా, మానవీయంగా మారుతుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖల అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -