– వడ్డె ఓబన్న విగ్రహానికి ₹1.40 లక్షల విరాళం
– అంబేద్కర్ విగ్రహాల దాత దండు అయ్యప్ప
నవతెలంగాణ మక్తల్ /నర్వ : నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో రేనాటి వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ నిర్మాణానికి దండు అయ్యప్ప గారు రూ.1,40,000 (అక్షరాల ఒక లక్ష నలభై వేల రూపాయలు) నగదును అందజేశారు.గత సంవత్సరం రాంపూర్ గ్రామంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గ్రామానికి చెందిన వడ్డెర సహోదరులు పూనుకోగా, విగ్రహ తయారీ ఖర్చును తానే భరిస్తానని నర్వ గ్రామ వాస్తవ్యుడు, నర్వ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల దాత దండు అయ్యప్ప హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పూర్తి మొత్తాన్ని నగదుగా వడ్డెర సహోదరులకు అందజేశారు.
ఈ సందర్భంగా రాంపూర్ గ్రామ వడ్డెర సహోదరులు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం వడ్డె ఓబన్న విగ్రహ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించి మాట నిలబెట్టుకున్న దండు అయ్యప్ప గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర్ వడ్డె బొంబాయి వెంకటన్న, మాజీ వార్డు సభ్యుడు వడ్డె సిద్ధన్న, వడ్డె రాములు, వడ్డె వెంకటన్న వడ్డె ఆటో మాసన్న, వడ్డె కురుమన్న తదితరులు పాల్గొన్నారు.



