తమన్నా నాగసాధువుగా నటించిన చిత్రం ఓదెల-2. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్‌లో డివైన్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. నిర్మాత మధు మాట్లాడుతూ, సంపతి నంది, నేను ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాం. అను కున్నట్లుగానే మంచి భక్తిభావం ఉన్న సినిమాను తీశాం. ఈ సినిమా ద్వారా నా లైఫ్‌లో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. ఈ సినిమా గురించి కొన్ని రివ్యూస్ చూసి చాలా ఆశ్చర్యపోయా. ప్రేక్షకులంతా సినిమా బాగుందని అంటుంటే.. రివ్యూవర్స్ కొంతమంది మాత్రం నెగిటివ్‌గా రాశారు. అది మంచి పద్ధతి కాదు. రివ్యూవర్స్ కంటే ప్రేక్షకుల ఫీలింగ్ మాకు ముఖ్యం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తున్నారు. అందుకే అందరూ థియేటర్‌కు వచ్చి డివైన్ ఫీల్‌ను ఎంజారు చేయాలని కోరుకుంటున్నాః అని అన్నారు. సినిమా బాగుంటేనే కలెక్షన్స్ పెరుగుతాయి. సినిమా బాగుంటేనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. అది మా చిత్రానికి జరుగుతోందిః అని డైరెక్టర్ అశోక్ చెప్పారు. సంపత్ నంది మాట్లాడుతూ, నేను ఈ సినిమా కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడు. ఇది నాకు సాధ్యమయ్యే కథ కాదు. ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసి ప్రతిదీ తెలుసుకుని రాశాను. నంది, శివుడు కనిపించినప్పుడు వాళ్లు ఫీల్ అయిన దాన్ని నాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరి వాళ్లు ఫోన్ చేసి ప్రౌడ్ ఆఫ్ ఓదెల అని చెబుతుంటే అద్భుతంగా భావిస్తున్నా అని అన్నారు.
మాకు ప్రేక్షకుల ఫీలింగే ముఖ్యం
- Advertisement -
RELATED ARTICLES