Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంబుద్ధవనాన్ని సందర్శించిన అందాల భామలు

బుద్ధవనాన్ని సందర్శించిన అందాల భామలు

- Advertisement -

– స్వాగతం పలికిన కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌
– భారీ బందోబస్తు
– ఐద్వా, సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్‌
నవ తెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. వారికి జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి నేతృత్వంలో జానపద, గిరిజన నృత్యాలతో విజయ విహార్‌ వద్ద స్వాగతం పలికారు. ముందుగా వారు నాగార్జున సాగర్‌ తీరాన ఉన్న విజయ విహార్‌లో ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. సాగర్‌ అందాలను వీక్షించారు. గౌతమబుద్ధుడి జయంతిని పురస్కరించుకుని సాగర్‌లో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో వారు పాల్గొన్నారు. బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూజలు చేసి మహా స్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ఆర్కియాలజిస్ట్‌ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం లంబాడా కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్మారెడ్డి, బాలూనాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, ఐఏఎస్‌ అధికారి లక్మి, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, ఏస్పీలు రమేష్‌, మౌనిక, ఆర్డీఓలు, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ముగిసిన పర్యటన
ప్రపంచ సుందరీమణుల సాగర పర్యటన ప్రశాంతంగా ముగిసింది. 20 రోజుల నుంచి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. ఇదే క్రమంలో మిస్‌ వరల్డ్‌ పోటీలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళన చేస్తుండటంతో పోలీసు అధికారులు 2000 మందితో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఐద్వా, సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్‌
మిస్‌వరల్డ్‌ అందాల పోటీదారుల సాగర్‌ పర్యటన నేపథ్యంలో ఐద్వా, సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమం అనంతరం వారిని వదిలిపెట్టారు. అరెస్టయిన వారిలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, నాయకులు అరుణ, ఉమ, వేములపల్లిలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు పోలే బోయిన వరలక్ష్మి, కేతెపల్లి మండలంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులును అరెస్టు చేశారు. దేవరకొండలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నల్ల వెంకటయ్యను అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -