Wednesday, September 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ జన్నారం:

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు పొందిన కిష్టాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న, దాముక కమలాకర్ ను జన్నారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సోమవారం ప్రెస్ క్లబ్ లో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

కమలాకర్ మునుముందు జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చిలువేరు నర్సయ్య, గాజుల లింగన్న గౌడ్, ఉపాధ్యక్షులు ఎంబడి మల్లేష్, కోశాధికారి శీల చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్టులు పూదరి సత్యనారయణ, తాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -