‘అర్ధనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి భిన్న సినిమాలతోపాటు ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో అందర్నీ అలరించిన అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఎస్.ఎస్.మీడియా సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో, గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాత. డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 11న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే సాంగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా రెండవ లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ‘భూమ్ భూమ్’ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్‌ను గీతా మాధురి అందరినీ హుషారెత్తించే విధంగా పాడారు. రాంబాబు గోశాల సాహిత్యం బాగా కుదిరింది. సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ఆడియన్స్‌కి మంచి పార్టీ సాంగ్‌గా అలరిస్తుంది’ అని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా : ఈశ్వర్, ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్ : గణపర్తి నారాయణరావు.