Thursday, May 22, 2025
Homeతాజా వార్తలుకిరాణా షాపులో ఫ్రిడ్జ్ తెరుస్తూ బాలుడి మృతి

కిరాణా షాపులో ఫ్రిడ్జ్ తెరుస్తూ బాలుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నం (D), ఆనందపురం (M) చందక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కిరాణా దుకాణంలో మంచినీటి కోసం ఫ్రిడ్జ్ తెరిచిన బాలుడు దశ్వంత్ (14) విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దశ్వంత్ చందక కూడలిలో టిఫిన్ కోసం వెళ్లాడు. మంచినీటి కోసం పక్కనే ఉన్న కిరాణా షాపులోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడంతో షాక్ కొట్టి కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -