- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక వరాహనది సమీపంలో రక్తపు మడుగులో బాలుడు కౌసిక్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి శరీరంపై లోతైన గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా తునికి చెందిన కౌశిక్ ఏటికొప్పాకలో మేనమామల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. కౌశిక్ తండ్రి ఇటీవల మృతి చెందాడు.
- Advertisement -



