మీ మెదడు చెత్త బుట్టలా ఉంటే ఎంత మంచి అవకాశం వచ్చినా వధానే. రాముడు అయోధ్యలో ఉన్నాడు, రావణుడు లంకలో ఉన్నాడు. అలాగే ధర్మరాజు, దుర్యోధనుడు హస్తినాపురంలోనే ఉన్నారు. కొంత కాలానికి కష్ణుడు, కంసుడు ఒకే చోట ఉన్నారు. కానీ వారు పెరిగిన విధానం వేరుగా ఉంది. ప్రస్తుతం మంచీ చెడు, నెగిటివ్ పాజిటివ్ రెండూ మనలోనే ఉన్నాయి. రెండింటిలో ఎవరు దేనిని ఎంచుకుంటారో దానిని బట్టే వారి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.
మన మనస్సును ఎంత నియంత్రణలో వుంచుకున్నాం అన్నదాని పైన, మనం పెరిగిన విధానం, పరిసరాలు, కుటుంబ నేపధ్యం మొదలైనవి మనల్ని ప్రభావితం చేస్తాయి. అలా అని పండిత కుటుంబంలో పుట్టిన అశ్వద్ధామ అవివేకి అయ్యాడు. బోయవాడిగా పుట్టిన రత్నాకరుడు (వాల్మీకి అసలు పేరు) రామాయణ కావ్యానికి శ్రీకారం చుట్టాడు. అంటే ఇక్కడ మనుషులు మారిన విధానం అంతిమంగా పరిగణలోకి తీసుకోవాలన్నది నా ఉద్దేశం. మనషులలోని మంచి – చెడు అనే రెండు షేడ్స్‌ను ఎలా వాడుకుంటామనేది మన వ్యక్తిత్వంపైన ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యక్తి అరటిపండు తింటూ ఉండగా చేతుల్లోంచి జారీ కిందపడింది అనుకుందాం. అది వెండి పళ్ళెంలో పడితే ఏం తేడా రాదు. దాన్ని తీసుకొని తింటాం. అదే చెత్త బుట్టలో పడ్తే పనికిరాదు. నీ మనస్సు వెండి పళ్ళెంలా వుంటే నీకు పనికి వస్తుంది. అదే చెత్త బుట్టలా వుంటే ఎంత మంచి ‘అవకాశం’ వచ్చినా వధా అయిపోతుంది. కాబట్టి ముందు మీరు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి. తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో మార్గం అన్వేషించండి. దానికి సూత్రం అనుసరించండి. ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించండి. మెదడును సమన్వయం చేసుకోండి. అప్పుడు సరైనదనిపిస్తే ముందుకు కదలండి. కానీ దురదష్టం ఏంటంటే మనం ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించం కానీ గుడ్డిగా పనిచేస్తాం. ఫలితం నెగిటివ్‌గా వస్తే అప్పుడు ఆలోచిస్తాం. అదే మనం చేసే అతి పెద్ద తప్పు. అందుకే ముందుగానే ఆలోచించుకుంటే జరగబోయే నెగిటివ్ రిజల్ట్‌ను అరికట్టొచ్చు కదా!
రాముడు రావణుడిని ఎందుకు చంపాడనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న కాదు. అక్కడ సమాధానం క్లియర్‌గా వుంది. అలాగే కౌరవుల్ని పాండవులు ఎందుకు సంహరించారనేది? అక్కడా సరియైన సమాధానమే వుంది. దానికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అధర్మ మార్గంలో వున్నారు కాబట్టే వారు సంహరింపబడ్డారన్నది గమనించుకోవాలి. అందుకే మనం కూడా ఆలోచించుకోవడానికి సమయం కేటాయించుకొని ఏ పని చేయడానికైనా ముందుగానే ఏది మంచి ఏది చెడు ఆలోచిస్తే మనస్సుకు మంచి మార్గం తట్టుతుంది. అప్పుడే ముందుకెళ్ళాలి. అలా కాకుండా గుడ్డిగా వెళితే తప్పకుండా ఓటమి లేదా చెడు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా ఒక మంచి ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఏదైనా షాపుకి వెళ్లేముందే ఏది కొనాలనే ఆలోచన మనస్సులో వుంటుంది. మరి అలాంటప్పుడు నీ భవిష్యత్తు ఎలా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించావా? ఏది సరైనది, ఏది కాదు అని ఒకసారి మీ జీవితాన్ని ఊహించుకోండి. మీ కళ్ళముందు ఉన్నది సరైనది, కళ్ళముందు లేనిది బ్రాంతి. అలాంటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి కదా.
మన పని మనం చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి అనేది కేవలం భ్రమ మాత్రమే. ఓ రోజు నిద్రలేచిన క్రూర మగం… ఈ రోజు మంచి ఆహారం దొరకాలని వేడుకుంటుంది. అదే సమయంలో జింక కూడా నిద్ర లేచి ఈరోజు నేను ఏ క్రూర మగానికీ ఆహారంగా దొరక్కుండా చూడు అనుకుంటుంది. అప్పుడు పైవాడు ఏమంటాడు ఓసారి ఆలోచించండి? ఎవరిని వద్దంటాడు ఎవరికీ వరం ఇస్తాడు పైవాడు అనేవాడు కేవలం భ్రమ. నువ్వు ఏ పని చేసినా పనిలో పెట్టిన శ్రద్ధను బట్టి ప్రతిఫలం తప్పకుండా నీకు అనుకూలంగా వస్తుంది. తెల్ల కాగితం మీద చక్కర/ పంచదార అని రాసినంత మాత్రాన ఆ కాగితం తియ్యటి రుచిని ఇవ్వదు. అలాగే ఓ అట్ట మీద పులి అనో సింహం అనో రాసి ఎదుటి వారిని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. ఇలాంటి ఆలోచనలన్నింటికి ప్రధాన వేదిక ‘మెదడే’. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే అలాగే స్పందిస్తుంది. వర్షాన్ని ఆస్వాదిస్తున్న పిల్లవాడు ఆ వర్షంలో చిన్న చిన్న పేపర్ పడవలు వదిలి ఆనందిస్తాడు. డెబ్బై సంవత్సరాల వద్ధుడు అదే వర్షం ద్వారా వచ్చిన చలికి దుప్పటి కప్పుకుంటాడు. అలాగే అదే వర్షాన్ని ఆనందిస్తూ ఓ రచయితో, కవో చక్కటి గీతాన్నో, కావ్యాన్నో రాస్తాడు. ఇక్కడ ‘వర్షం’ ఎవరికి ఎలా ఉపయోగపడిందన్నది ముఖ్యం. అలాగే ఎవరు ఎలా స్పందిస్తున్నారన్నది కూడా ముఖ్యమే. కాబట్టి ‘మన మెదడు చెత్త బుట్టలా వుంటే ఎంతమంచి అవకాశం వచ్చినా వద్ధానే. ప్రముఖ గ్రీకుతత్వవేత్త సోక్రటీస్ ” (ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది) అంటాడు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనస్సు కూడా ఆరోగ్యంగా స్పందిస్తుంది. అందుకే రెండింటిని సమన్వయం చేసుకోండి. మన మెదడులో వచ్చిన ఆలోచనల ఫలితంగానే నేడు ఇన్ని మార్పులు జరిగాయన్న వాస్తవాన్ని మరువకండి.
డా|| మహ్మద్ హసన్
మెదడు చెత్త బుట్ట కాదు
- Advertisement -