Thursday, March 12, 2026
E-PAPER
Homeఖమ్మంచేతపట్టిన జెండా మరణించే వరకు వదలని ధీరుడు సీతారాములు 

చేతపట్టిన జెండా మరణించే వరకు వదలని ధీరుడు సీతారాములు 

- Advertisement -

పేదల గుడిసెలను కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకే 
బిజెపి పాలనలో విలువలు, నియమాలు, ప్రజాస్వామ్యం ఖూనీ
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు 
నవతెలంగాణ – బోనకల్ : ఆవుల సీతారాములు యుక్తవయసులో సీపీఐ(ఎం) జెండా చేతబట్టి మరణించే వరకు వదలని వీరుడు అని,ఖమ్మంలోనే వెలుగుమట్లలో పేదల గుడిసెలను కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకే పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆరోపించారు. మండల పరిధిలోనే చొప్పకట్లపాలెం గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి ఆవుల సీతారాముల సమస్మరణ సభ సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన గురువారం జరిగింది. తొలుత ఆవులు సీతారాముల చిత్రపటానికి పోతినేని సుదర్శన్ రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, డివిజన్ కార్యదర్శి సభ్యులు పాపినేని రామ నరసయ్య మండల కార్యదర్శి కిలారు సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో కష్ట జీవుల కోసం సీపీఐ(ఎం) మాత్రమే పనిచేస్తుందని నమ్మిన వ్యక్తి ఆవులు సీతారాములు అన్నారు. తనకు జ్ఞాపకం వచ్చిన దగ్గరనుంచి సీపీఐ(ఎం) జెండాను చేతబట్టి ఆ జెండాను  మరణించే వరకు విడవకుండా జీవించిన వ్యక్తి సీతారాములని, అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సీతారాములు మంచి కమ్యూనిస్టు అన్నారు. చదువుకోకపోయినా, సిద్ధాంతం తెలియకపోయినా పార్టీపై అసంచల విశ్వాసం ఉంచిన వ్యక్తి సీతారాములు అన్నారు. కమ్యూనిస్టులపై నిర్బంధాలు, కేసులు ఉంటాయి, అయినా అనేకమంది పేద ప్రజల హక్కుల కోసం పోరాడేదుకు ముందుకు వస్తున్నారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయం కూడా ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతుందన్నారు. పార్లమెంటులో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై మాట్లాడేందుకు స్పీకర్ ప్రతిపక్ష ఎంపీలకు అవకాశం ఇవ్వకపోవడం కుట్రలో భాగమే అన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రభావం మన దేశంపై తీవ్రంగా పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పూర్తిగా లొంగిపోయాడని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు డోనాల్డ్ ట్రంప్ అనుమతి తీసుకోవలసిన పరిస్థితి నరేంద్ర మోడీకి పట్టిందని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో వెలుగుమట్లలో పూరి గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేద ప్రజల గుడిసెలను కూలగొట్టటాన్ని తీవ్రంగా ఖండించారు. కేరళ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వకపోగా ప్రభుత్వ స్థలంలో పూరి గుడిసెలు వేసుకొని నివాసముంటున్న వారి పూరి గుడిసెలను కూలగొట్టి రోడ్డున పడేయటం దారుణం అన్నారు.
సీతారాములు శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు 
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు 
ఆవుల సీతారాములు చొప్పకట్లపాలెం గ్రామంలో సీపీఐ(ఎం) అభివృద్ధికి నిరంతరం శక్తిమేరకు కృషి చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఆవులు సీతారాములు మంచి కమ్యూనిస్టు, ధన్యజీవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై భారాలు మోపి ఆనందం పొందుతున్నారన్నారు. బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు, హక్కులు లేవన్నారు. సీతారాములు లేని లోటును చొప్పకట్లపాలెం సీపీఐ(ఎం) శ్రేణులు పూర్తి చేయాలని కోరారు. నేడు బూర్జువా పార్టీలు రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యత లేకుండా మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, పాపినేని రామ నరసయ్య, కిలారు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు చొప్పకట్లపాలెం ఉపసర్పంచ్ పల్లా కొండలరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శిలు బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు చలమల హరి కిషన్ రావు, మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు, ఐద్వా నాయకురాలు మార్కపుడి రజిని, సీతారాములు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -