Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిఆర్ఎస్ కుటుంబ పాలనను బిజెపి ద్వంద్వ వైఖరిని

బిఆర్ఎస్ కుటుంబ పాలనను బిజెపి ద్వంద్వ వైఖరిని

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని 8, 12, 31, 33, 34, 35, 36, 37 వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఉధృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో బిఆర్ఎస్ కుటుంబ పాలనను, బిజెపి ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.బిఆర్ఎస్‌ను “అవినీతి అడ్డా”గా అభివర్ణిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం ఉపయోగించబడిందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో నీళ్లు ఫామ్‌హౌస్‌లకు, నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ సామాన్య రైతులకు శాపంగా మారిందని అన్నారు. బిజెపి, బిఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలంటూ, ఢిల్లీలో స్నేహం –  గల్లీలో పోటీ చేస్తున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. బిఆర్ఎస్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం పడుతుండగా, మతం పేరుతో రాజకీయాలు చేయడం బిజెపి నైజమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడం కాంగ్రెస్ బాధ్యత అని స్పష్టం చేశారు. “మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి” అనే నినాదంతో మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగర వేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో వార్డు అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకడు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్, మాజీ కౌన్సిలరులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -