Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంకులగణన నిర్ణయం దేశచరిత్రలోనే మైలురాయి

కులగణన నిర్ణయం దేశచరిత్రలోనే మైలురాయి

– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జనాభా లెక్కలతో పాటు కులగణనను కూడా శాస్త్రీయంగా చేపట్టాలని మోడీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం దేశచరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ.సుభాష్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్‌, బీజేపీ సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ..కులగణన సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కీలకం కాబోతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కులగణన చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు. 1931లో చివరిసారి బ్రిటిష్‌ ప్రభుత్వం కులగణన చేసిందని గుర్తుచేశారు. అంబేద్కర్‌ సిఫారసు చేసిన బీసీ కమిషన్‌ (కాకా కలేల్కర్‌ కమిషన్‌)ను కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మరిచిపోవద్దని కాంగ్రెస్‌కి చురలకలంటించారు.. నెహ్రూ బీసీ రిజర్వేషన్లపై విముఖతతోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని గుర్తుచేశారు. కులగణన విషయంలో తెలంగాణ ‘మోడల్‌’ అని చెబుతూ రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి లాంటి నేతలు మాట్లాడటం మొసలి కన్నీరేనన్నారు. కులగణన బీసీలకు, మైనారిటీ వర్గాలకే కాకుండా, దేశం మొత్తానికి సామాజిక-ఆర్థిక సమతుల్యతను తీసుకొచ్చే మార్గమని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -