– బీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ ఉద్యమాల ఫలితంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణను చేపట్టాలని నిర్ణయించిందని తెలంగాణ బీసీ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. జనాభా లెక్కింపు, కులగణనను కేంద్రం నిష్పక్షపాతంగా చేపట్టాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ వర్గాలకు వాటాలను పంచాలని సూచించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతోపాటు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కులగణన మాత్రమే చేయకుండా చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ హక్కులను ఎస్సీ,ఎస్టీ,బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో సమానంగా దక్కేలా చూడాలని కోరారు.
బీసీ ఉద్యమాల ఫలితమే కులగణన
- Advertisement -
RELATED ARTICLES