Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జన గణనలో తప్పులు లేకుండా పూర్తి  చేయాలి…

జన గణనలో తప్పులు లేకుండా పూర్తి  చేయాలి…

- Advertisement -

– జిల్లా కలెక్టర్ అనురాగ్  జయంతి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : జ‌నాభా లెక్కంపు ప్ర‌క్రియ‌పై పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉండి జనగణనలో  తప్పులకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి  అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో జనగణన – 2027 ఫేస్ – 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు చివరి రోజు శిక్షణ తరగతులలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ‌న‌గ‌ణ‌న ప్రక్రియలో ప్రతి వివరాన్ని కచ్చితంగా  నమోదు చేయాల‌ని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన క‌లిగి ఉండాల‌న్నారు.  డేటా సేకరణలో ఎలాంటి పొర‌పాట్లు లేకుండా చూడాల‌ని, అలాగే  జ‌న‌గ‌ణ‌న నిబంధనలపై పూర్తి అవ‌గాహ‌నతో త‌ప్ప‌లు లేకుండా అప్రమత్తంగా   వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ లో చేస్తున్న పని విధాన్ని కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు, సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -