- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న జరిగిన సమావేశంలో వడ్డీ రేటును 8.25శాతం వద్దనే కొనసాగించాలని నిర్ణయించింది. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 0.10శాతం పెంచి 8.15శాతానికి పెంచిన విషయం తెలిసిందే.
- Advertisement -