Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంలేబర్‌కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తోన్న కేంద్రం

లేబర్‌కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తోన్న కేంద్రం

- Advertisement -

– తెలంగాణ గిరిజన సంఘం
– సార్వత్రిక సమ్మెకు మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్త్తోన్నదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ విమర్శించారు. కార్మిక, రైతు, సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం మద్దతును ప్రకటించింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌, హైదరాబాద్‌ అధ్యక్షులు రామ్‌ కుమార్‌ నాయక్‌, కిషన్‌ నాయక్‌లు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరాం నాయక్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం నూతన చట్టాలను ప్రవేశ పెడుతున్నదని తెలిపారు. అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలు కాపాడే విధంగా చట్టాలను సవరిస్తున్నదని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాదిమంది గిరిజనులు, దళితులు, బలహీనవర్గాలు, పేదలు ఆధారపడి జీవిస్తుంటే దాన్ని పూర్తిగా రద్దు చేయాలనే కుట్రకు పాల్పడుతున్నదని తెలి పారు. బడ్జెట్‌లో గతంలో ఎన్నడు లేని విధంగా కోత పెట్టిం దని విమర్శించారు. తరతరాలుగా అటవీ, పోడు భూము లపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులను అడవుల నుంచి బలవంతంగా గెంటేసే విధంగా అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 పేరుతో తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఆదివాసీ గిరిజనులకు ఉన్న హక్కులతో పాటు ఐదు, ఆరో షెడ్యూల్‌ ప్రాంత హక్కులు, చట్టాలపై దాడిని తీవ్రతరం చేసిందని తెలిపారు. సమ్మెలో రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -