Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్రం పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది

కేంద్రం పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది

- Advertisement -

– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
– కేంద్రం తిరుపట్ల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం శివారులోని గాంధీ నగర్ వద్ద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని  రద్దుచేసి పేద ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.తిరిగి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ప్రజల జీవనోపాధిలో కీలకపాత్ర పోషించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో బలహీనమైన వీబీ-రామ్ జీని తీసుకురావడం సరైంది కాదన్నారు. ఇది గ్రామీణ పేదల హక్కులను హరించడం తోపాటు, చట్టం ద్వారా ఆర్థిక భారం మొత్తం రాష్ట్రాలపై పడుతుందన్నారు. రాష్ట్రాలు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని విమర్శించారు.

అంతకు ముందు ఆయన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాగపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -