Friday, September 12, 2025
E-PAPER
HomeNewsకేంద్ర ప్రభుత్వానికి పతనం తప్పదు

కేంద్ర ప్రభుత్వానికి పతనం తప్పదు

- Advertisement -

యూరియా ను రైతులకు సరిపడేంత ఇవ్వాలి
సిపిఐ మండల కార్యదర్శి బైసా స్వామి
నవతెలంగాణ – నెల్లికుదురు

రైతులు వేసిన పంటకు కావాల్సినంత యూరియాను సకాలంలో అందించకుంట్ట రైతాంగానే మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజెపి పతనం తప్పదని  సిపిఐ మండల కార్యదర్శి బైసా స్వామి బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంక్షలు లేకుండా రైతులకు కావాల్సినంత యూరియాను అంది ఇవ్వాలని తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి దుక్కులు దున్ని విత్తనాలు వేసి  వెయ్యిలలో ఖర్చు చేసి నాట్లు వేసి ఇతర రకాల పంటలు వేసి పంటలు పండించుకుందామంటే, ఆ పంటకు వేయవలసిన యురిగాను సకాలంలో ఎవ్వకపోవడం వల్ల పంటలు దెబ్బతిని రైతాంగం ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చెందారు.

అప్పులు తెచ్చి వ్యవసాయనికి పెట్టుబడి పెట్టి పంటలు పండించుదామని కష్టపడుతున్న తరుణంలో యూరియా బస్తాల కొరతతో రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుందని తెలిపారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వంలు రైతాంగని పట్టించుకోకపోవడం వల్ల మా రైతన్నలు యూరియా కొరతతో అనేక  ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం అడికాపులు కావలసిన సందర్భం నెలకొన్నదని తెలిపారు. ప్రభుత్వాలు రైతును రాజును చేస్తామని గొప్పలు తప్ప వారిని పట్టించుకోవడంలో విఫలం చెందారని అన్నారు. రైతులు వరి మొక్కజొన్న పత్తి ఇతరత్రా పంటలు వేసి మొదటి దశలో యూరియా వేద్దామని చూస్తున్న తరుణంలో పంటకు సరిపడా యూరియా దొరకక పంట నష్టం జరుగుతుందని అన్నారు.

రెండవ దశ వచ్చిందని దానికి కూడా దొరకకపోవడం రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉందని అన్నారు. రైతులు అప్పులు కూరుకుపోయారని వీటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాo స్పందించి రైతులకు కావాల్సినంత యూరియాను త్వరలో ఒకటి రెండు రోజుల్లో పంపించకుండా కాలయాపన చేస్తుంటే రైతులను ఏకం చేసి ప్రభుత్వలపై ఎగబడక తప్పదని అన్నారు.రైతన్న ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆ పార్టీ మండల సహాయ కార్యదర్శి చెర్ర సత్యనారాయణ, నాయకులు వర్రీ వెంకన్న రఫీ తో పాటు కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -