నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో అకాల వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ఆక్నూర్ సెక్టార్ ఎగువ భాగంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శుక్రవారం భారీమొత్తంలో వర్షం నీరు.. సింధు ఉపనది అయిన చీనాబ్ నదిలోకి ప్రహహించింది. ఆ నది నిండు కుండను తలపిస్తోంది. . అదేవిధంగా జమ్మూలోని లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది. అకాల వర్షాలకు ఢిల్లీ కకావికలమైన విషయం తెలిసిందే.
- Advertisement -