పెరిగిన చికెన్ ధరలు..గుడ్డు ధర పతనం
నవతెలంగాణ-మల్హర్ రావు
చికెన్ ధరలు పైపైకి పోతే..కోడిగుడ్డు ధర పతనమైంది.కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ రేటు పెరిగిందని,గుడ్ల ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.డిసెంబర్, జనవరిలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి,ఆ తరువాత మేడారం జాతర సందర్భంగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.300 మొదలు, రూ.350 వరకు పలికింది.ఇక ఫిబ్రవరిలో కిలోకు రూ.100 తగ్గి రూ.250కు దిగి వచ్చింది.మార్చి ఆరంభం నుంచి మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే కిలో చికెన్కు రూ.100 వరకు ధర పెరిగింది. మరో రెండు,మూడు రోజుల్లో రంజాన్ పండగ వస్తుంది.ఈ పండగ వేళ సహజంగా మాసం ధరలు కొంత పెరగటం సహజం. ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేక పోవటంతో చికెన్ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా వ్యాపారులు వాపోతున్నారు.
గుడ్డు ధర తగ్గింది…కోడి ధర పెరిగింది
మూడు నెలల క్రితం రిటైల్ గుడ్డు ధర ప్రాంతాన్ని బట్టి రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.5.50 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారు. చలికాలంలో గుడ్డు వినియోగం ఎక్కువగా కాబట్టి ధర ఎక్కువగా ఉండడం వేసవిలో తగ్గడం సాధారణమే.కానీ ధర సగానికి పొట్టిపోయేoతగా ఎప్పుడూ తగ్గలేదు.వేసవిలో పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపరు.దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గింది.మండలంలో నిత్యం రెండు నుంచి మూడు క్వింటాళ్ళ చికెన్ వినియోగం ఉంటుందని అంచనా.కరీంనగర్, గంగారం, సుల్తానాబాద్ ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుడటంతో చికెన్ ధరకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు.కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పతనమవటంతో పౌల్ట్రీవ్యాజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ప్రస్తుతం ఉన్న దానా ధర, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్క గుడ్డు ఉత్పత్తికి రూ.4.50 ఖర్చవుతోంది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.20గా ఉండటంతో రూ.0.30 నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం లేయర్ కోళ్ల పరిశ్రమల నిర్వహణ నుంచి కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితితులు ఉన్నాయని చెబుతున్నారు.
కొండెక్కిన కోడి…గుడ్డు డమాల్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



