- స్టేట్ టీచర్స్ యూనియన్
నవతెలంగాణ కంఠేశ్వర్
ఉద్యోగులు బోనసులడగట్లేదు, సంక్షేమ పథకాలు ఆపి జీతాలు పెంచమనట్లేదు, మాకు రావాల్సిన డిఎలు ప్రకటించాలని, మేము దాచుకున్న జిపిఎఫ్ సొమ్ములే అవసరానికి మాకు ఇవ్వమని అడుగుతున్నారు. రిటైరైన ఉద్యోగులు వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 14 నెలలుగా ఎదురుచూస్తున్నారు. అవి ఈ ఆర్ధిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రిగారు ఇప్పుడు మాట మార్చడం విచారకరం అని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఒక ప్రకటనలో అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించాలి కానీ ఇలా మాట్లాడటం శోచనీయం. డి ఎ లు, పిఆర్సి లు అనేవి ఉద్యోగుల హక్కులు వాటిని సకాలంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఇప్పటికైన ముఖ్యమంత్రి గారు జెఎసి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో విశ్వాసం నిలుపుకోవాలని కోరుతున్నాం.