కమల్ హాసన్ నటంచిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. తాజాగా బుధవారం మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఓ మార’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఏఆర్ రెహ్మాన్ కంపోజిషన్ మర్చిపోలేని రైడ్‌ను అందిస్తుంది. ట్యూన్ బీట్ ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శింబు బోల్డ్ క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేస్తోంది. ఆదిత్య ఆర్కే సాంగ్‌ని పాడిన విధానం అదిరిపోయింది, రాకేందుమౌళి రాప్ సాంగ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. అనంత శ్రీరామ్ ‘థగ్ లైఫ్’ ప్రపంచం లాగానే ట్రెండీ, ఇంపాక్ట్ ఫుల్ లిరిక్స్ అందించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ ఎన్ సుధాకర్ రెడ్డి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘ఓ మార..’ సందడి మొదలైంది
- Advertisement -
- Advertisement -