Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ సర్కారు చేసింది కుల సర్వేనే

కాంగ్రెస్‌ సర్కారు చేసింది కుల సర్వేనే

- Advertisement -

– కులగణన పేరుతో ప్రజలకు మోసం : డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కర్నాటకలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కులగణన చేయలేదనీ, కుల సర్వేలు చేసి ప్రజలను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2011లో యూపీఏ ప్రభుత్వం చేసిన ”సోషియో ఎకనామిక్‌ కుల సర్వే” వివరాలను ఇప్పటివరకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. 2026లో జనగణన చేపడతామని మోడీ సర్కారు స్పష్టం చేయడంతో రాహుల్‌గాంధీలో, కాంగ్రెస్‌ నేతలతో ఆందోళన మొదలైందన్నారు. తెలంగాణలో 40 ఏండ్లలో బీసీ జనాభా 52 శాతం నుంచి 46 శాతానికి ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణలో పట్టణ జనాభా 52 శాతముందనీ, గ్రామాల నుంచి వలసొచ్చిన బీసీలే అందులో అధికమని చెప్పారు. వారిని లెక్కలో చేర్చకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువగా చూపించిందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయని కారణంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad