రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై పార్టీలకతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సిద్దిపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్ సూచించారు.గురువారం మండల పరిధిలోని చెర్లంకిరెడ్డి పల్లి,సికింద్లాపూర్ గ్రామాల్లో నిర్వహించిన జై బాఫు..జై భీమ్..జై సంవిధాన్ యాత్ర అజ్జూ యాదవ్ నిర్వహించారు.రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.బీసీ సెల్ మండలాధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్,బీసీ సెల్ జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్,సేవాదళ్ మండలాధ్యక్షుడు అరుకుల శ్రీకాంత్ యాదవ్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు వాసరి అజయ్,మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.