Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి 

- Advertisement -
  • – అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారి చంద్రయ్య 
  • నవతెలంగాణ -తాడ్వాయి 
  • ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఏళ్లుగా పూర్తి కావడం లేదని, వెంటనే పూర్తి చేయాలని అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండారు చంద్రయ్య సంబంధిత అధికారులను కోరారు. ఆదివారం మండల కేంద్రంలో అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న, ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సుమారు నాలుగు సంవత్సరాల క్రితం 25 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి, స్లాబ్ వేసి అసంపూర్తిగా నిర్మించారని అన్నారు. అప్పటినుంచి నేటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా పనులు నిలిచిపోయాయని ఆవేదన చెందారు. పనులు పూర్తి చేసి భవనాన్ని వినియోగంలోకి తేవాలని అధికారులు, ప్రజాప్రతిలను కోరిన స్పందనలేదని, పాలకులు అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారినా దళితుల బతుకులు మారడం లేదని ఆవేదన చెందారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉంటే నిరుపేదలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎస్సీ కమిటీ హాల్ పూర్తిస్థాయిలో నిర్మాణం జరగకపోవడం దళితులను అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగితే దళిత వర్గాల ప్రజలకు, ఇతర సామాన్య ప్రజలకు అనేక విధాలుగా మేలు జరుగుతుందని భావించామని, కానీ ఆ పనులు నత్తనడకన సాగడం బాధాకరం అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి చొరవ తీసుకొని కమిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని ఆయన కోరారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -